బిగ్ బ్రేకింగ్: యాంకర్ సుమ అరెస్ట్.. టెన్షన్ లో అభిమానులు..!?

తెలుగు ఇండస్ట్రీలో .. తెలుగు బుల్లితెరపై .. యాంకర్ సుమ అన్న పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో క్రేజ్ తో.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సుమ .. కేవలం యాంకర్ గానే కాదు పలు సినిమాల్లో నటించి మెప్పించింది . అంతేకాదు పలు ఈవెంట్స్ కి.. హోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో.. యూట్యూబ్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటుంది . పేరుకు మలయాళ బ్యూటీ అయినా సరే తెలుగింటి కోడలుగా తన మాటలతో మైమరిపిస్తున్న యాంకర్ సుమ కనకాల అరెస్ట్ అయ్యింది అన్న వార్త అభిమానులను టెన్షన్ పెడుతుంది.

అయితే అటువంటి భయం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు . అరెస్టు అయిన మాట వాస్తవమే అంటున్నారు జనాలు. కానీ ఆమె నిజంగా అరెస్టు అవ్వలేదు.. ఓ సినిమాలో భాగంగా రాసిన స్క్రిప్ట్ కారణంగా ఇంత హైడ్రామా చేస్తున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలు సుమ అరెస్ట్ అయింది . అయితే ఇది నిజంగా ఆమె ఏ నేరమో..? రాబరీ..? చేసి అరెస్టు అయింది కాదు .

నాగచైతన్య లేటెస్ట్ గా నటిస్తున్న కస్టడీ మూవీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అరెస్టు అయినట్లు ఓ న్యూస్ వైరల్ చేస్తున్నారు . వాళ్ళ సినిమాను ప్రమోట్ చేయడానికి యాంకర్ అరెస్టు అయినట్లు డ్రామా చూస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఇది సుమకి కొత్త కాదు. గతంలో ఎన్నో సార్లు సినిమా టైటిల్ కి తగ్గట్టు అలాంటి గెటప్ లోనే మైమరిపించిన సందర్భాలు ఉన్నాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు వెబ్ సైట్లల్లో యాంకర్ సుమ కనకాల అరెస్టు అయింది అన్న వార్త రాగానే అభిమానులు టెన్షన్ పడుతున్నారు .

తీరా మేటర్ తెలుసుకున్నాక వార్నీ.. ఇదా సంగతి..!! అంటూ కూల్ అయిపోతున్నారు . చూడాలి మరి సుమ ఇంత కష్టపడినా కస్టడి సినిమా ఏ రేంజ్ లో హిట్టు అందుకుంటుందో. ప్రెసెంట్ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ.. పలు షోస్ ..ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తున్న సుమ యూట్యూబ్లో ఓ ఛానల్ ఓపెన్ చేసి తన లైఫ్ కి సంబంధించిన విషయాలు.. బ్యూటీ సీక్రెట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది..!!