బాలయ్య- అనుష్క కాంబోలో రావలసిన రెండో సినిమా.. ఆ స్టార్ హీరోయిన్ కి ఎలా వెళ్ళింది..!

యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో వందో సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య తన వందో సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ‌ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది.

Watch Gautamiputra Satakarni - Disney+ Hotstar

ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా చేయాలని బాలయ్య అనుకున్నారు. అయితే ఆ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ బిగ్బి అమితాబచ్చన్ డేట్లు ఇవ్వలేకపోయారు. దీంతో చివరకు క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణికే బాలయ్య ఓటేశారు.. ఆంధ్ర దేశాన్ని పాలించిన 17వ శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మరో విశేషం ఏంటంటే అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 కు పోటీగా రిలీజ్ అయ్యి మరి శాతకర్ణి హిట్ అయింది. ఆ సంక్రాంతికి యువ హీరో శర్వానంద్ శతమానం భవతి కూడా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది.

బాలయ్య కోసం అనుష్క వస్తుందా.. | Anushka As Guest For Balakrishna Unstoppable Season 2 - Telugu Aha Ott, Aha, Allu Aravind, Anushka, Balakrishna, Balayya, Tollywood, Unstoppable

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మహారాణి పాత్రలో శ్రియ నటించింది. బాలయ్య శ్రియ హిట్ కాంబినేషన్ వీరి కాంబినేషన్లో చెన్నకేశవరెడ్డి -గౌతమీపుత్ర శాతకర్ణి- పైసా వసూల్ వంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందు నయనతార పేరు వినిపించింది ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో క్రిష్ ఎలాగైనా అనుష్కను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. త‌ను దర్శకత్వం వహించిన వేదం సినిమాలో అనుష్క తన నటనతో ప్రేక్షకులను మైమరిపింపజేసింది. అందుకే ఎలాగైనా అనుష్కను ఒప్పించి బాలయ్య కి జోడిగా నటింపజేయాలని అనుకున్నారు. అనుష్క కూడా బాహుబలి2- సైజ్ జీరో సినిమాల‌ షూటింగ్ లతో బిజీగా ఉండడంతో డేట్లు సర్దుబాటు చేయలేకపోయింది.

Gautamiputra Satakarni 1st day worldwide box office collection: GPSK turns biggest opener for Balakrishna, Krish - IBTimes India

దీంతో ఈ అవకాశం శ్రియకు దక్కింది..ఇక సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర అయినా గౌతమీ బాలశ్రీ పాత్రకు ప్రముఖ హిందీ నటి హేమమాలిని తీసుకున్నారు. అంతకు ముందు బాలయ్య- అనుష్క కాంబినేషన్లో వచ్చిన ఒక్కమగాడు డిజాస్టర్ అయింది చివరకు శాతకర్ణి లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశం అనుష్క మిస్ చేసుకుంది. ఇక ఆ తర్వాత బాలయ్యతో నటించే అవకాశం ఆమెకు ఎప్పుడూ రాలేదు. ప్రస్తుతం అనుష్క యువ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ మూవీ చేస్తుంది. అంతకుమించి అనుష్క చేతులో ఏ సినిమా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో అనుష్క ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందు వస్తుందో చూడాలి.