బాల‌య్య అలాంటోడే.. హాట్ టాపిక్ గా మారిన టిల్లు గాడి కామెంట్స్‌!

`డీజే టిల్లు` మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ప్ర‌స్తుతం `టిల్లు స్కేర్‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా అల‌రించ‌బోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జొన్నలగడ్డ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవ‌ల సిద్ధు జొన్నలగడ్డ విశ్వక్ సేన్‌తో కలిసి బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`లో హాజరయ్యాడు. ఈ క్రమంలోనే ఈ కుర్ర హీరోలకు బాలయ్యతో మంచి బాండింగ్ ఏర్పడింది.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో బాల‌య్య వ్య‌క్తిత్వం గురించి సిద్ధు ఓపెన్ అయ్యాడు. `బాలకృష్ణ గారు మంచి మనసున్న సూప‌ర్ మ్యాన్‌. ఆయ‌న్ను అర్థం చేసుకోవడానికి చాలా పెద్ద హృదయం కావాలి. కేలవం బయట ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కూడా ఆయనకు అభిమానులే ఉన్నారు. ఆయన ఒక్కసారి ఒక మనిషిని తన సొంత వ్యక్తి అని భావిస్తే.. అతడి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందమైన, దయ కలిగిన చిన్నపిల్లాడి మనస్తత్వం బాలయ్యది` అంటూ సిద్ధు చెప్పుకొచ్చాడు. దీంతో టిల్లు గాడి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.