గ్లోరీ నైట్ వేర్ లో బిగ్ బాస్ ఫేమ్ అరియనా… మెళికలు తిరుగుతున్న కుర్రాళ్ళు!

బిగ్ బాస్ ఫేమ్ అరియనా గురించి తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండనే వుండరు. బిగ్ బిగ్ బాస్ హౌస్ లో ఆమెని మిస్ అయిన ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఆమెని పరిచయం చేసుకున్నారు. అదేనండి… ఆమె అందాల ఆరబోతను చూసి బాగా తరించారు. కట్ చేస్తే అరియనాకు ఇపుడు ఓ హీరోయిన్ కి వున్న క్రేజ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా సెగలు పుట్టిస్తోంది. దాంతో చెడ్డీలు వేసే కుర్రాళ్ళు సైతం అరియనా, అరియనా అంటూ కలవరించడం మనం చూస్తూనే వున్నాం.

ఈ క్రమంలోనే ఆమె తాజాగా గ్లోరీ నైట్ వేర్ లో చేసిన ఫోటో షూట్ తో సోషల్ మీడియా వేదికగా సందరి చేసారు. ఇక ఆ ఫోటోలను చూసి కుర్రకారు మెళికలు తిరుగుతోందంటే అతిశయోక్తి కాదు. తన ఫోటోలను ఉద్దేశిస్తూ కొందరు నెటిజన్లు క్రేజీ కామెంట్ చేయగా దానికి దానికి నెటిజన్లు తిరిగి ప్రశ్నలు వేస్తున్నారు. అరియనా గ్లోరీకి బోల్డ్ ఇమేజ్ ఉంది. తాజాగా బోల్డ్ అంటే ఏమిటి? అని ఓ నెటిజెన్ మరొక నెటిజన్ ని అడగగా నైట్ వేర్లో ఫోటో షూట్ చేయడమే బోల్డ్ అని సమాధానం ఇచ్చాడు.

ఆ సమాధానానికి తగ్గట్టే ఆమె ఆ నైట్ వేర్ లో అదరగొట్టే అందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది. మరికొందరు నెటిజన్లు ఆమెని ‘బనియన్స్, డ్రాయర్స్ వ్యాపారం చేస్తున్నావా? ‘ అని కొంటెగా ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే అరియనా తాజాగా ఓ యువ నటుడితో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన సోషల్ మీడియా కామెంట్స్ దానికి కారణమయ్యాయి. ‘ఒకరిని ప్రేమించాలనే భావన లేకుండా ప్రేమలో పడిపోతాం. అదే నిజమైన ప్రేమ. ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది’ అంటూ కామెంట్ చేసింది. ఆ కామెంట్ ఆమె కొంపని ముంచింది. ఎందుకంటే అరియనా ఎక్కడికి వెళ్లినా అదే విషయం పైన ప్రశ్నలు వేస్తున్నారు.