రామ్ చ‌ర‌ణ్ ముద్దుగా పెంచుకుంటున్న పెట్ డాగ్ `రైమ్‌` విలువ తెలిస్తే మైండ్ బ్లాకే!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు ఓ క్యూట్ అండ్ లిట్ పెట్ డాగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. దాని పేరు `రైమ్‌`. రామ్ చ‌ర‌ణ్ వీలైనంత వ‌ర‌కు ఎక్క‌డికి వెళ్లినా.. త‌న వెంట రైమ్ ను తీసుకెళ్లూ ఉంటారు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా చ‌ర‌ణ్ వెంట రైమ్‌ ఉండాల్సిందే. `ఆర్ఆర్ఆర్` ప్ర‌మోష‌న్స్ లో రైమ్ సంద‌డి చేసి అంద‌రినీ ఆక‌ర్షించింది.

రీసెంట్ గా భార్య‌తో మల్దీవ్స్ వేకేష‌న్ పూర్తి చేసుకుని హైద‌రాబాద్ కు వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ కు రైమ్ స్వాగతం పలికింది. ఎయిర్‌పోర్టులో రైమ్‌ను కింద వదలగానే ఎదురుగా వస్తున్న రామ్ చరణ్ వద్దకు పరుగు పరుగున వెళ్లింది. తన బాస్‌ను చూసిన ఆనందంలో చలాకీగా తోకజాడిస్తూ అల్లరి చేసింది.

వెంటనే రైమ్ ను ఎత్తుకుని రామ్ చరణ్ ప్రేమ‌తో దానిపై ముద్దుల వ‌ర్షం కురిపించాడు. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. రైమ్ పేరిట ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఆ అకౌంట్ కు 50 వేల మంది ఫాలోవ‌ర్స్ కూడా ఉన్నాయి. అయితే రామ్ చ‌ర‌ణ్ ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఈ పెట్ డాగ్ విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫ్రెంచ్ బార్బెట్ బ్రీడ్ అయిన రైమ్ ధర రూ. 35,000 మరియు రూ. 70,000 మధ్య ఉంటుంది. రైమ్ జాతికి పెట్ డాగ్స్ ను కొనుగోలు చేయాలంటే ఆ రేంజ్ లో ఖ‌ర్చు పెట్టాల్సిందే అట‌.