గీత ఆర్ట్స్ బ్యానర్ కి మరొక కాంతారావు లాంటి సినిమా..?

ఈమధ్య ఏదైనా ఒక సినిమా ఒక భాషలో విడుదలవుతోంది అంటే ఒకప్పుడు ఆ సినిమాని రీమిక్స్ చేయడానికి ఇండస్ట్రీ ఫిలిమ్స్ మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమిక్స్ కాస్త తగి అదే సినిమా అని తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. అలా తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇలా ఇతర భాషలలోని సినిమాలు బాగున్నాయంటే చాలు ఎక్కువగా దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి ప్రొడ్యూసర్స్ తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

లవ్ టుడే చిత్రాన్ని దిల్ రాజు మంచి కలెక్షన్లు సాధించగా.. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన కాంతారా సినిమా కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేసి కలెక్షన్లను బాగానే సంపాదించారు . ఇప్పుడు తాజాగా మరొక హిట్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి గీత ఆర్ట్స్ బ్యానర్ సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తమిళంలో ఇటీవల విడుదలైన విడుదలై-1 మొదటి భాగం సూపర్ హిట్టుగా నిలిచింది ఈ చిత్రాన్ని వెట్రిమారం స్టైల్ ఆఫ్ మేకింగ్ సూరి మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో, విజయ్ సేతుపతి స్టండింగ్ యాక్షన్ తో ఆకట్టుకున్నారు.

ఇక తమిళనాడులో సెకండ్ వీక్స్ లో ఎంటర్ అయిన ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగులో మొదటి భాగాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 15న మొదటి భాగాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు.దీన్ని మేకర్ ట్రైలర్ విడుదల చేస్తూ రా ఇంటెన్స్ రియలిస్టిక్ మేకింగ్ చూడాలనుకున్న వాళ్లకి పార్ట్ వన్ ఏప్రిల్ 15న విడుదల కాబోతోంది అంటూ తెలిపారు. ఈ సినిమా గీత ఆర్ట్స్ కి మరొక కాంతారావు అవుతుందేమో చూడాలి మరి.