బ‌న్నీని మందు తీసుకుర‌మ్మ‌న్న ఎన్టీఆర్‌.. వీడియో చూస్తే తట్టుకోలేరంతే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున బ‌ర్త్‌డే సందర్భంగా నిన్న సోష‌ల్ మీడియాలో ఆయ‌న పేరు మారుమోగిపోయింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అల్లు అభిమానులు బ‌న్నీ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. అలాగే బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన `పుష్ ది రూల్‌` టీజ‌ర్ ఎంత‌లా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు.

ఇక‌పోతే బ‌న్నీకి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ట్విట్ట‌ర్ ద్వారా బ‌ర్త్‌డే విషెస్ చెప్పాడు. `హ్యాపీ బర్త్ డే బావ` అంటూ ల‌వ్లీగా ఎన్టీఆర్ ట్విట్ చేయ‌గా.. అందుకు బ‌న్నీ `నీ విషెస్ కు చాలా థాంక్యూ బావ.. బిగ్ హగ్స్` అని రిప్లై ఇచ్చాడు. దాంతో ఎన్టీఆర్ `కేవలం హగ్స్ మాత్రమేనా.. పార్టీ లేదా పుష్ప..?` అంటూ ప్ర‌శ్నించాడు. అందుకు బ‌న్నీ `వ‌స్తున్నా` అంటూ ట్వీట్ చేశాడు.

వీరిద్ద‌రి మ‌ధ్య సంభాషణ చూసి ఇద్ద‌రి హీరోల అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇక‌ ఓ నెటిజ‌న్ దేశముదురు మరియు టెంపర్ మూవీ క్లిప్స్ ని క్లబ్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో ఎన్టీఆర్ మందు తీసుకుర‌మ్మ‌న్న‌డం.. అందుకు బ‌న్నీ వస్తున్నా.. కుమ్మేసుకుందాం అని చెప్ప‌డం చాలా ఫ‌న్నీగా ఉంటుంది. మొత్తానికి న‌వ్వులు పూయిస్తున్న ఎన్టీఆర్-బ‌న్నీ మందు పార్టీ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

https://twitter.com/UdayAAdhf/status/1644733757663121409?s=20