మ‌హేష్ కూతురుకు స్టార్ హీరోయిన్ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌.. ఫుల్ ఖ‌షీలో సితార‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల్లోకి రాక‌పోయినా సోష‌ల్ మీడియా ద్వారా ఈ చిన్నారి భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా సితార‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్పెష‌ల్ గిఫ్ట్ తో స‌ర్‌ప్రైజ్ చేసింది.

ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు అలియా భ‌ట‌. అలియా భట్ `ఈద్ ఏ మమ్మ`(ED-A-MAMMA) పేరుతో ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ ర‌న్ చేస్తోంది. కిడ్స్ వేర్ కి సంబంధించిన ఈ బ్రాండ్ ని అలియా తనదైన శైలిలో ప్రోమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవ‌ల త‌ర‌చూ స్టార్ కిడ్స్ కి దుస్తులు పంపుతూ వార్త‌లో నిలుస్తోంది.

ఆల్రెడీ ఎన్టీఆర్ త‌న‌యులిద్ద‌రితో పాటు రామ్ చ‌ర‌ణ్‌కు పుట్ట‌బోయే బిడ్డ‌కు అలియా భ‌ట్ బ‌ట్ట‌లు పంపింది. తాజాగా సితార‌కు సైతం స్పెష‌ల్ డ్రెస్‌ల‌ను గిప్ట్ గా పంపి ఆమెకు ఖుషీ చేసింది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సితార తెలియజేశారు. ‘మీ ఫ్యామిలీలో నన్ను ఒకరిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీరు పంపిన దుస్తులు నాకు ఎంతగానో నచ్చాయి` అని కామెంట్ చేసింది. అంతేకాదు, అలియా పంపిన దుస్తులు ధరించి ఆ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంది.