`ఏజెంట్` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. డిజాస్ట‌ర్ టాక్ తో ఎంత వ‌సూల్ చేసిందో తెలుసా?

అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని దాదాపు 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు.

భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఏజెంట్‌.. మొద‌టి ఆట నుంచే డిజాస్ట‌ర్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. అక్కినేని అభిమానులు సైతం ఈ మూవీపై పెద‌వి విరిచారు. ఇక భారీ ఒపెనింగ్స్ సొంతం చేసుకోవాల్సిన ఈ చిత్రం.. తొలి రోజు ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.00 కోట్ల రేంజ్ లో షేర్ ను వ‌సూల్ చేసిన ఏజెంట్ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 4.95 కోట్ల షేర్‌ను అందుకుంది. ఏరియాల వారీగా ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.33 కోట్లు
సీడెడ్: 64 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 54 ల‌క్ష‌లు
తూర్పు: 29 ల‌క్ష‌లు
పశ్చిమ: 30 ల‌క్ష‌లు
గుంటూరు: 52 ల‌క్ష‌లు
కృష్ణ: 22 ల‌క్ష‌లు
నెల్లూరు: 16 ల‌క్ష‌లు
——————————————–
ఏపీ+తెలంగాణ‌= 4.00 కోట్లు(6.60కోట్లు~ గ్రాస్‌)
——————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాప్ ఇండియా: – 0.30 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 0.65 కోట్లు
———————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 4.95కోట్లు(8.60కోట్లు~ గ్రాస్)
———————————————–

కాగా, రూ. 37 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఏజెంట్.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే మొద‌టి రోజు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 32.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.