అక్కడ చైతు ఇక్కడ అడవి శేషు.. ఇద్దరు ఇలా దొరికేసారేంటి..?

టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు హీరోల గురించి ఒక వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు ఒకరు నాగ చైతన్య మరొకరు అడవి శేషు.. సమంతాతో విడాకుల తర్వాత నటి శోభిత ధూళిపాళ్లతో చైతన్య డేటింగ్ చేస్తున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి ఇక వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇలా వార్తలు వైరల్ గా మారుతున్నా .. చైతన్య సైడ్ నుంచి కానీ శోభిత నుంచి కానీ ఎవరు ఈ విషయాన్ని ఖండించలేదు.

ఇక ఇద్దరు కలిసి ఈ మధ్య ఎక్కువగానే కనిపిస్తూ ఉండడంతో దాదాపుగా వీరి పైన వినిపిస్తున్న వార్తలు నిజమే అనేలా కనిపిస్తున్నాయి. తాజాగా ఒక హోటల్లో శోభితతో కలిసి ఉన్న చైతన్య ఒక ఫోటో వైరల్ గా మారింది. చైతన్య సంగతి అలా ఉంటే ఇప్పుడు యంగ్ హీరో అడవి శేషు పై కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి రూమర్సే వైరల్ గా మారుతున్నాయి.. అడవి శేషు విషయానికి వస్తే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రీత తో చట్టపట్టలేసుకొని తిరుగుతున్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరి మధ్య కూడా ఏదో ఉన్నట్టుగా వార్తలు చాలా సంవత్సరాల నుంచి వినిపిస్తున్నాయి.

ఇటీవల అక్కినేని ఫ్యామిలీ జరుపుకుంటున్న క్రిస్మస్ వేడుకలలో కూడా సుప్రీత , శేష్ పక్కపక్కనే కనిపించారు. ఇప్పుడు తాజాగా మరొకసారి వీరిద్దరూ ఒకే కారులో కనిపించి మీడియాకు చిక్కడం జరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోలు, దర్శకులు, నిర్మాతలు, పలువురు సెలబ్రిటీలు సైతం పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి అడవి శేష్ , సుప్రీత కూడా ఒకే కారులో వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అలా కారు దిగి నడుచుకుంటూ వచ్చినా అడవి శేషు తనకు తెలిసిన వారితో మాట్లాడుతూ ఉండగా .. సుప్రీత మాత్రం అలాగే నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. వీరిద్దరూ ఇలా కనిపించడంతో గత కొంతకాలంగా వీరిపై వస్తున్న రూమర్స్ కు బలం చేకూరేలా కనిపించింది.. దీంతో లండన్ లో నాగచైతన్య శోభిత దొరకగా.. ఇక్కడ సుప్రియ, అడవి శేషు దొరికిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.