NTR 30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అదిరిపోయే అప్డేట్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం డైరెక్టర్ కొరటాల శివతో. ఈ సినిమా NTR -30 వ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ RRR చిత్రంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు. ఈ చిత్రం ఇచ్చిన హిట్టుతో పాన్ ఇండియా లెవెల్లో తన తదుపరిచిత్రాలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్.

Janhvi Kapoor is all praises for NTR Jr; hails him as a legend | Telugu  Movie News - Times of India

అందుకే డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమాని కాస్త ఆలస్యమైన కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈరోజున ఆమె బర్తడే సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలు పెడతారా అన్నట్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ మరో రెండు రోజుల్లో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్టీఆర్ అమెరికాకు వెళ్ళబోతున్నాడు.HCA అవార్డు అందుకునేందుకు అమెరికాకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాంచరణ్ కూడా ఈ అవార్డును ఆల్రెడీ అందుకున్నారు. ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణంతో ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా వెళుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రోజున జాన్వీ కపూర్ సంబంధించి NTR -30 కి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.