NTR 30: ఎన్టీఆర్ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్..!

RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమాని చేయబోతున్నారు. ఈ చిత్రమైపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. అభిమానులు కూడా తన నెక్స్ట్ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ -30 వ సినిమా రిలీజ్ డేట్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయం గడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా పలు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే ఎట్టకేలకు ఈ రోజున ఆ రూమర్లకు తెరపడింది. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నట్లుగా ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇమే పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. జాన్వీ కూడా గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా సౌత్లో నటించాలని ఆఫర్లు వస్తే ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తానని చెప్పింది. ముఖ్యంగా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వస్తే అసలు రిజెక్ట్ చేయడానికి కూడా తెలిపింది.

బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఈమెకు సరైన సక్సెస్ రాలేదు. జాన్వీ దీంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తన హవ కొనసాగించాలని చూస్తోంది. గతంలో తన తల్లి శ్రీదేవి కూడా ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. శ్రీదేవి అభిమానులు కూడా జాన్వీ ఎంట్రీ కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అందరికల నెరవేలాల చేసింది జాన్వీ కపూర్. ప్రస్తుత ఫస్ట్ లుక్ కు సంబంధించి ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)