NBK -108: కాజల్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

టాలీవుడ్ లో ఇప్పటివరకు పలు సినిమాలలో నటించి ఊహించని గుర్తింపును తెచ్చుకున్న హీరో నందమూరి బాలకృష్ణ.. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏడాది మొదట్లో వీర సింహారెడ్డి సినిమా గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు బాలయ్య అనీల్ రావిపూడి డైరెక్షన్లో 108 వ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని చిత్ర బృందం చెప్పుకొస్తున్నారు.

Anil Ravipudi (@AnilRavipudi) / Twitter
అయితే ఈ సినిమాలో బాలయ్య సరికొత్త అవతారంతో కనిపించబోతున్నారు.ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించబోతోందన్న సమాచారం.అంతే కాకుండా బాలయ్య కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తోంది. ఇటీవలే ఆమె ఈ సినిమాలో జాయిన్ అయినట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది చిత్ర యూనిట్.

ఈ చిత్రంలో అందాల భామ కాజల్ అగర్వాల్ చాలా గ్యాప్ తీసుకుని ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టుగా దర్శకుడు అనిల్ రావు పూడి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. బాలయ్య ఈమధ్య తీస్తున్న సినిమాలు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈమధ్య తీసిన అఖండ సినిమా వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాలలో డ్యూయల్ రోల్స్ చేశారు .

ఇప్పుడు తీయబోతున్న సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు ధమన్. బాలయ్య కి ఎప్పటిలాగే సక్సెస్ లను అందుకోవాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకి విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

https://twitter.com/AnilRavipudi/status/1637818817345884160?s=20