నాగబాబు కూతురు విషయంలో ఎందుకు అలా చేస్తున్నారు..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇకపోతే తాజాగా మెగా డాక్టర్ నిహారిక గురించి ఆమె విడాకుల వ్యవహారం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. నిహారికకు 2020 వ సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో వివాహం జరిగింది.ఈ వివాహం చాలా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. అయితే వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Niharika Konidela did nothing wrong, says father Naga Babu after Hyderabad  pub raid | The News Minute

చైతన్య కూడా నిహారిక ఇంస్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం జరిగింది. అదేవిధంగా వీరి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇలా వెంకట చైతన్య ఫోటోలను సైతం డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఇలా చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరు విడిపోవడానికి ముఖ్య కారణం.. గతంలో ఒకసారి నిహారిక పబ్బులో చిక్కడం వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అప్పటినుంచి విడాకుల రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ కానీ చైతన్య ఫ్యామిలీ కానీ క్లారిటీ ఇవ్వలేదు.

NisChay Wedding: Naga Babu Pens An Emotional Note For His Daughter Along  With Sharing The Wedding Pic

ఇక మెగా కుటుంబం గురించి ఏ చిన్నమాట అన్న కూడా ఎప్పుడు స్పందిస్తూ ఉంటారు నాగబాబు.కానీ నాగబాబు కూతురు నిహారిక గురించి ఇలాంటి వార్తలు వస్తున్న స్పందించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీర నాగబాబు స్పందించకపోవడంతో నిహారిక గురించి వచ్చే వార్తలు నిజమేనని అందుకే మెగా ఫ్యామిలీ ఈ విషయం పైన స్పందించలేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు. గతంలో కూడా మెగాస్టార్ కూతురు శ్రీజ విషయంలో మెగా ఫ్యామిలీ స్పందించలేదు. మరి ఈ వార్తలు అన్నిటిపై మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.