గ్రాఫ్ డౌన్..జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

రోజురోజుకూ అధికార వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందా? అంటే డౌన్ అవుతున్నట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో అదిరిపోయే విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 49 శాతం ఓట్లు 151 సీట్లు సాధించింది. మరి ఇప్పటికీ అదే పరిస్తితి ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. వైసీపీ గ్రాఫ్ చాలా వర్కౌ డౌన్ అయిపోయింది. ఇటీవల వచ్చిన ఓ సర్వేలో వైసీపీకి 41 శాతం వరకు మాత్రమే ఓట్లు పడతాయని తేలింది.

అంటే వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందనే చెప్పాలి. ఇదే సమయంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా వైసీపీ ఓడిపోవడం..దారుణంగా ఓట్ల శాతం పడిపోవడం జరిగింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ స్థానాల్లో వైసీపీ గ్రాఫ్ బాగా డౌన్ అయింది. టి‌డి‌పి అనూహ్యంగా పుంజుకుంది. మూడు చోట్ల విజయం సాధించి టి‌డి‌పి సత్తా చాటింది. అయితే మూడు చోట్ల ఒకసారి ఓట్ల శాతం గమనిస్తే.. ఉత్తరాంధ్రలో వైసీపీ గ్రాఫ్‌ 18.89 శాతం దాకా పడిపోయింది. తూర్పు రాయలసీమలో 19.10 శాతం పడిపోయింది. ఇక పశ్చిమ రాయలసీమలోనూ 13.37 శాతం మేర వైసీపీ బలహీనపడింది.

అంటే  ఏ స్థాయిలో వైసీపీ వీక్ అవుతూ వస్తుందో చెప్పాల్సిన పని లేదు. అనూహ్యంగా టి‌డి‌పి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. అయితే ఇదే ఊపు కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పవు. అయితే గ్రాడ్యుయేట్ స్థానాలు వేరు..మామూలు అసెంబ్లీ స్థానాలు వేరు కాబట్టి ఆ స్థాయిలో ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. కాకపోతే గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీ గ్రాఫ్ బాగా డౌన్ అయిందని మాత్రం తెలుస్తోంది.

Share post:

Latest