ఒక్క ఫోటోతో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నివేద థామస్..!!

టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో వివాహం చేసుకుంటున్నారు. వివాహం కాని హీరోయిన్లకు సైతం ఎక్కడ కనిపించినా కూడా మీడియా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారి పెళ్లి గురించి అడగడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్లు కూడా ఈ విషయాన్ని అడుగుతూ ఉంటారు. దీంతో చాలామంది సెలబ్రిటీస్ తమ పెళ్లిళ్ల గురించి చెప్పలేక సతమతమవుతూ ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా నివేద థామస్ కి ఇటువంటి ప్రశ్న ఎదురవ్వడంతో వెంటనే ఒక షాకింగ్ ఆన్సర్ ని తెలియజేయడం జరిగింది.

Indian Celebs: Nivetha Thomas movies list

ఇక అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ లో హీరోయిన్ నివేద థామస్ తన నటనతో, అందంతో, గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఈ అమ్మడు మలయాళం, తమిళ్ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటూ అభిమానులకు అదిరిపోయే అప్డేట్లను ఇస్తూ ఉంటుంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నివేద థామస్ 2016లో టాలీవుడ్ హీరో నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా అందించిన విజయంతో వరుస అవకాశాలను అందుకుంద.చివరిగా షాకిని డాకిని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. తాజాగా తమ అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను తెలియజేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఒక నెటిజన్ మీ పెళ్లి ఎప్పుడు అని అడగడంతో.. నివేద థామస్ తెలుపుతూ ఆలోచన.. ఉద్దేశం.. ఏమీ లేవండి.. ఉన్నప్పుడు లేదా ఉంటే చెప్తాను అంటూ తన గోరింటాకు పెట్టుకున్న ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటో వైరల్ గా మారుతోంది.