`ద‌స‌రా` నాని కెరీర్ లోనే బెస్ట్‌.. కానీ, అవే పెద్ద మైన‌స్ లు!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా `ద‌స‌రా`. సుకుమార్ ప్రియు శిష్యుడు శ్రీ‌కాంత్ ఓదెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. శ్రీ‌రామ‌న‌వ‌మి కానుక‌గా నేడు ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుద‌ల అయింది. ఇప్ప‌టికే ప్రీమియర్ షోలు ప‌డ‌టంతో మూవీ ల‌వ‌ర్స్ సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

గోదావ‌రి ఖ‌ని స‌మీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన రా అండ్ ర‌స్టిక్ సినిమా ఇది. అయితే ఈ చిత్రానికి ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూ వ‌స్తున్నాయి. సినిమా అద్భుతంగా ఉందని.. నాని కెరీర్ లోనే ద‌స‌రా బెస్ట్ మూవీ అవుతుంద‌ని అంటున్నారు. నాని పెర్ఫామెన్స్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింద‌ని.. కీర్తి సురేష్ నానితో పోటీ ప‌డి న‌టించింద‌ని అంటున్నారు. కీర్తి సురేష్, నాని మధ్య ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయి.

డైరెక్ట‌ర్ టేకింగ్‌, క్లైమాక్స్‌, బీజీఎమ్‌ నెక్స్ట్ లెవల్. అయితే కొన్ని సాగ‌దీత స‌న్నివేశాలు, ఊహ‌ల‌కు అనుగుణంగా సాగే క‌థ‌నం పెద్ద మైన‌స్ లు అని అంటున్నారు. అలాగే విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర‌ఖ‌నిని కూడా స‌రిగ్గా వాడుకోలేక‌పోయార‌ని చెబుతున్నారు. ఇలాంటి మైన‌స్ లు ఉన్న‌ప్ప‌టికీ.. నాని-కీర్తి సురేష్‌ల న‌ట‌న‌, బీజీఎమ్‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు, సాంగ్స్‌, ఎమోష‌న్స్ వాటిని తొక్కేశాయ‌ని, ద‌స‌రా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము లేప‌డం ఖాయ‌మ‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.