తారకరత్న కూతురు మాట్లాడిన ఈ మాటలు వింటే ఏడ్చేస్తారు!

నందమూరి తారకరత్న హఠాన్మరణం సినిమా వారితో పాటు సామాన్యులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. తారకరత్న పెద్ద కూతురు నిషిక తండ్రి మరణించిన తరువాత కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మరింత కలిచి వేసాయి. కాగా తాజాగా నిషిక రాసిన ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తారకరత్న మరణాన్ని అతని భార్య అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేకపోతుంది. అలేఖ్య రెడ్డి బాధను చూసి నిషిక ఈ పోస్ట్ రాసినట్లు తెలుస్తుంది. నిషిక తన పోస్ట్ లో “అమ్మా.. నువ్వు చాలా బాధలో ఉన్నావు, నువ్వు ఇంకోసారి ఏడిస్తే గుడ్ బై చెబుతా” అని చెప్పుకొచ్చింది.

నిషిక చిన్న వయస్సులోనే తల్లిపై ప్రేమను వ్యక్తపరచటంతో పాటు తల్లి ఏడిస్తే తాను అస్సలు తట్టుకోలేనని కామెంట్లు చేసింది. కూతురు రాసిన నోట్ ను అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిషిక మాటల్లోని మీనింగ్ ను అర్థం చేసుకున్న నెటిజన్లు అలేఖ్య బాధను చూసి ‘నిషిక కూడా బాధ పడుతోంది. అలేఖ్య, కూతురిని బాధ పెట్టకుండా అడుగులు వేయండి’ అని చెబుతున్నారు. పిల్లల కోసం అయిన అలేఖ్య రెడ్డి బాధలను తట్టుకుంటూ కెరీర్ పరంగా ముందడుగులు వేయాల్సిన అవసరం చాలా ఉంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా చిన్నమ్మా నిషికమ్మా అంటూ అలేఖ్య తెలిపారు.

ప్రస్తుతం అలేఖ్యారెడ్డికి నందమూరి కుటుంబ సభ్యుల అవసరం ఉంది. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే అలేఖ్య కుటుంబానికి సపోర్ట్ గా ఉన్నాడు. ఇక మిగలిన నందమూరి కుటుంబం కూడా ఆమెకి తొండుగా ఉంటే బాగుంటుంది. అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ పాలిటిక్స్ లో మాత్రం అలాంటి కామెంట్లు ఏమి వినిపించడం లేదు. అలేఖ్య రాజకీయాల్లోకి వస్తారో లేక వ్యాపారాల్లోనే కెరీర్ ను కొనసాగిస్తారో చూడాల్సి ఉంది.

Share post:

Latest