ప్రభాస్, మహేష్‌లపై రానా అంతలేసి మాటలు అంటాడా.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

 

ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల క్రేజ్ నడుస్తుంది. అసలు పాన్ ఇండియా సినిమాలను మనందరికీ పరిచయం చేసిన మొదటి దర్శకుడు రాజమౌళి. అలానే పాన్ ఇండియా మొదటి హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో విలన్ పాత్రలో భల్లాల దేవగా దగ్గుబాటి రానా నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు రానా.

ప్రస్తుతం రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి ‘రానా నాయుడు’ అనేది వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. మార్చి 10న రానా నాయుడు వెబ్‌సిరీస్ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దానికి సంబంధించి ప్రమోషన్స్‌లో బాగా బిజీ అయ్యాడు రానా. ఈ క్రమంలోనె ఒక ఇంటర్వ్యూకి హాజరైన రానా మాట్లాడుతూ మన తెలుగు హీరోల గురించి బాలీవుడ్ హీరోలు ఏమనుకుంటున్నారో చెప్పుకొచ్చాడు. రానా మాట్లాడుతూ ‘ప్రస్తుతం మన తెలుగు సినిమాలు హిందీలో బాగా సందడి చేస్తున్నాయి. ఇక నా రెండో సినిమా హిందీలోనే చేసాను. భాష పేరుతో సినిమాలని వేరు చేసి చూసే రోజు పోయాయి.” అని చెప్పారు.

అంతేకాకుండా కొంతకాలం క్రితం జరిగిన ఒక సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. రానా ఒకసారి బాలీవుడ్‌కి వెళ్ళినప్పుడు తన మిత్రుడిని కలిసి బాహుబలి సినిమా గురించి చెప్పి దాంట్లో నేను, ప్రభాస్ నటిస్తున్నామని అన్నాడట. దాంతో వెంటనే అతను ప్రభాస్ ఎవరు అని అడిగాడట. అలా అడగానే రానా ఒక్కసారిగా షాక్ అయ్యాడట. ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు పేర్లు తన మిత్రుడికి చెప్పే ప్రయత్నం చేసానని కానీ ప్రభాస్ సినిమాలు ఒకటి కూడా అతను చూడలేదని తెలిపాడు. తనకి టాలీవుడ్ లో చిన్ను భర్త తప్ప ఎవరూ తెలియదని కూడా తెలిపాడట.

అయితే అసలు చిన్ను ఎవరో రానాకి చాలాసేపటి వరకూ అర్థం కాలేదట. ఆ తరువాత చిన్ను అంటే నమ్రత అని తెలుసి, కేవలం నమ్రత భర్తగానే మహేష్ తెలియడం ఏంటి అని ఆశ్చర్యపోయాడట రానా. దాంతో రానా తన స్నేహితుడికి ‘ త్వరలోనే మా టాలీవుడ్ ఆర్మీ అంతా మీ బాలీవుడ్ పై దండయాత్ర చేస్తుంది చూడు’ అని చెప్పారట. అప్పట్లో రానా చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అవడం చూసి అతని స్నేహితుడు సంతోషించాడట. ప్రభాస్, మహేష్‌లపై రానా ఫ్రెండ్ అంతలేసి మాటలు అనడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు.

 

Share post:

Latest