మళ్లీ ప్రేమలో పడిన దీప్తి సునయన.. ఈసారి ఎవరితోనంటే..

మీడియాలో సెలబ్రిటీలు పెట్టే పోస్టులు, ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వాళ్ళు పెట్టె షాకింగ్ పోస్టులు చూసి అభిమానులు తెగ అల్లరి చేస్తుంటారు. అయితే తాజాగా దీప్తి సునయన షేర్ చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఆమె ప్రేమలో పడ్డానని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ పోస్ట్ చూసి అందరూ ఎవరితో దీప్తి లవ్ లో పడిందని రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు విషయం లోకి వెళితే..

దీప్తి సునయన డబ్‌స్మాష్ వీడియోలతో పరిచయమై మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. యూట్యూబ్‌లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకొని వెండితెరపై అవకాశాలు అందుకుంది. ఇక బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 2లో అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. దీప్తి హౌస్ లో ఉన్నపుడు తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ గురించి ఇతరులతో ఎక్కువగా మాట్లాడేది. దాంతో అతను ఎవరో తెలుసుకోడానికి చాలా మంది ఆసక్తి చూపించేవారు.

షణ్ముఖ్ కూడా యూట్యూబ్ స్టార్ గా మారి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతను కూడా బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగు పెట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. షణ్ముఖ్ బిబి హౌస్ లో ఉన్నపుడు తన పిల్లోపై దీప్తి సునయన పేరు రాసాడు. దాంతో వాళ్లిదరు నిజంగానే ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా షణ్ముఖ్ బర్త్ డే రోజు దీప్తి గ్రాండ్‌గా సర్‌ప్రైజ్ చేసింది. ప్రపోజ్ కూడా చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. కానీ షన్ను బిగ్ బాస్ లో మరో కంటెస్టెంట్ సిరితో మితిమీరి ప్రవర్తించడం వల్ల దీప్తి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది .

 

 

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను మరోసారి ప్రేమలో పడ్డానని తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది దీప్తి. ఆ ఫోటోలో రకరకాలుగా ఫోజ్ లు ఇచ్చి ఫాల్ ఇన్ లవ్ విత్ లెర్నింగ్ అని హగ్ ఇస్తున్న ఎమోజీలతో పాటు లవ్ సింబల్‌ని యాడ్ చేసింది. అంటే ఆమె నేర్చుకునే విషయంలో ప్రేమలో పడ్డానని తెలిపింది. అయితే కొందరు మాత్రం ఎవరితో అంటూ సరదాగా కామెంట్స్ పెట్టి రచ్చ చేస్తున్నారు.

Share post:

Latest