Ari: ట్రైలర్ తో మరొకసారి అనసూయ తన మార్కును చూపించబోతోందిగా..!!

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎన్నో చిన్న సినిమాలు హవా కొనసాగుతూనే ఉంది.కంటెంట్ బాగుంటే చాలు చిన్న సినిమాకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇటీవల విడుదలైన చిన్న చిత్రం బలగం కూడా వారి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరొక డైరెక్టర్ సైతం బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా కొనసాగించేందుకు గురిపెట్టినట్లు తెలుస్తోంది.. పేపర్ బాయ్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ జయశంకర్ ఇప్పుడు.. అరి అని సినిమాతో థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

అరి అని టైటిల్తో ప్రేక్షకుల మనసులో ఇంట్రెస్టింగ్ని క్రియేట్ చేశారు ఫస్ట్ లుక్, టీజర్, ప్రమోషన్స్ వీడియోలతో ప్రతి ఒక్కరిని కూడా ఆసక్తి రేపేలా చేస్తోంది. ఇటీవల సింగర్ మంగ్లీ పాడిన చిన్నారి కిట్టయ్య పాట కూడా బాగానే ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ పాట కూడా తెగ వైరల్ గా మారుతుంది ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా స్టోరీ మనిషి ఎలా బతకకూడదు అనే కొత్త అంశంతో చూపించినట్లుగా తెలుస్తోంది. ఆరుగురు శత్రువులతో ఓ ఎయిర్ పోస్టును ఎలాంటి పోరాటాన్ని సాగించిందని కథ అంశంతో తెరకెక్కించారు.

ఈ చిత్రంలో అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. ముఖ్యంగా అనసూయ చెప్పే డైలాగ్ కూడా చాలా హైలైట్ గా నిలుస్తోంది. అనసూయ కూడా ఈసారి సరికొత్త పాత్రలో కనిపించబోతోంది. మరి ఈసారైనా అనసూయ సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.<
/p>