పదే పదే అదే బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్న బాలయ్య.. యవ్వారం తేడాగుందే..!?

సినీ ఇండస్ట్రీలో బాలయ్యకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ ..రీసెంట్ గానే వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతకుముందు అఖండతో సినిమా కరోనాతో అల్లాడిపోతున్న సినిమా ఇండస్ట్రీకి ఓ దారి చూపించిన బాలయ్య.. ప్రజెంట్ ఎన్.బి.కె 108 సినిమా చేస్తున్నాడు . కాగా రీసెంట్గా నందమూరి తారకరత్న మరణించిన కారణంగా సినిమా షెడ్యూల్ ని పోస్ట్ పన్ చేసిన బాలయ్య త్వరలోనే కొత్త షెడ్యూల్ ని ఫిక్స్ చేయపోతున్నాడు అంటూ తెలుస్తుంది.

కాగా ఈ క్రమంలోనే బాలయ్య ఓ కమర్షియల్ యాడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “వేగ శ్రీ” అనే జ్యువెలరీ యాడ్ ని బాలయ్య ఓకే చేశారు .ఈ యాడ్ కోసం అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్‌ తో జోడి కట్టాడు. ఇదివరకే అఖండ సినిమాతో హిట్ పెయిర్ గా టాక్ సంపాదించుకున్న ఈ జంట..మరోసారి జతకట్టడంతో..ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అఖండ సినిమా టైంలోను .. సినిమా ప్రమోషన్స్ లోనూ.. సక్సెస్ మీట్లలోను ప్రగ్యా-బాలయ్యతో ఆడి పాడి అలరించింది. అంతేనా బాలయ్య మరో సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంటుంది అంటూ వార్తలు వినిపించాయి.

ఇలాంటి క్రమంలోనే బాలయ్య తో కమర్షియల్ యాడ్ లో ప్రగ్యా అవకాశం కొట్టేసింది. ఆమెకు పదే పదే బాలయ్య ఛాన్స్ ఇవ్వడం ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే బాలయ్య కూడా ప్రగ్యాకి మరీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఈ యాడ్ లో శృతిహాసన్ ఇంకా బాగుండేది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు కొందరు కుర్రాళ్ళు రెచ్చిపోయి బాలయ్య ఫేవరెట్ హీరోయిన్ హనీ రోజ్ నున యాడ్ కి పెట్టుంటే రచ్చ రంబోలాగా ఉండేది అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో ఎంతో మంది ట్రెడిషనల్ హీరోయిన్స్ ఉన్న కేవలం ప్రగ్యాకే బాలయ్య్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటా..? అంటూ జనాలు జుట్టు పీక్కుంటున్నారు . దీనికి ఆన్సర్ బాలయ్య చెప్తేనే బాగుంటుందేమో అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం దీనిపై బాలయ్య ఏవిధంగా స్పందిస్తారో..?