రాశి ఖ‌న్నా అందాల జాత‌ర‌కు కుర్రాళ్లు విల‌విల‌.. జాకెట్ తీసేస్తూ టెంప్టింగ్ ఫోజులు!

రాశి ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారింది.

తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాశి.. అక్కడ కూడా బాగానే క్లిక్ అయింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వ‌రుస ఫ్లాపులు పడటంతో రాశి ఖ‌న్నా గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది.

ఇక కెరీర్ డేంజ‌ర్ జోన్ లోకి వెళ్తుంది అనుకుంటున్న‌ సమయంలో.. `సర్దార్` మూవీతో హిట్ కొట్టి మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కింది.

ప్ర‌స్తుతం రాశి చేతిలో ఓ బాలీవుడ్ మూవీ ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న `యోధ` మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.

మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కు కూడా ఆమె సైన్ చేసింది. అలాగే రాశి ఖ‌న్నా న‌టించిన వెబ్ సిరీస్ `ఫార్జి` ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

ఇక‌పోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి.. త‌ర‌చూ స్ట‌న్నింగ్ ఫోటోషూట్లతో కుర్ర‌కారు గుండెల్లో మంటలు పెడుతుంటుంది.

తాజాగా కూడా ట్రెండీ అవుట్ ఫిట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. లెదర్ జాకెట్ ను తీసేస్తూ టెంప్టింగ్ ఫోటోలకు ఫోజులిచ్చింది.

రాశి కన్నా అందాల జాతరకు కుర్ర‌కారు విల‌విల‌మంటూ కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాశి కన్నా తాజా పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

 

Share post:

Latest