అరెరే, ఈ అమ్మాయి ఎవరో అచ్చం కరీనా కపూర్ లాగానే ఉందే..!!

 

ఇంటర్నెట్‌లో ఇప్పటికే ఎంతోమంది సినీ తారలను పోలిన వ్యక్తులు వైరల్ అయ్యారు. వీరు అచ్చు గుద్దినట్లు వారిలాగానే ఉండటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది కూడా. బాలీవుడ్, హాలీవుడ్‌ సినీ తారలను పోరిన ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కాగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ట్ హీరో కరీనా కపూర్ ఖాన్‌ను పోలిన ఒక ఆమె సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆమె ఎవరో కాదు ఇన్‌ఫ్లుయెన్సర్ అస్మితా గుప్తా. ‘జబ్ వి మెట్’ సినిమాలో ‘నగడ నగదా’ అనే పాటకు అస్మిత చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఆమె అచ్చం కరీనాకపూర్ లాగా ఉండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అస్మితకి 1,40,000 ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమె ఎక్కువగా కరీనా నటించిన సినిమాలోని ఫేమస్ డైలాగ్స్, అలానే డ్యాన్స్‌లు చేసి ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి ఫాలోవర్స్ ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. అలానే నగడ నగదా సాంగ్ కి సేమ్ కరీనా లా పింక్ డ్రెస్ వేసుకొని డాన్స్ చేసింది. ఇక ఆమె డాన్స్ చేస్తతూ తీసుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. ఆ వీడియో చూసి కరీనా బాగానే ఉంది ఈమె ట్విన్ సిస్టర్ అంటే కచ్చితంగా ఎవరైనా నమ్ముతారు అని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే అష్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ చిన్నపాటి స్టార్ స్టేటస్ ను ఆస్వాదిస్తోంది. అద్భుతమైన డ్యాన్స్ రీల్స్ చేస్తూ, బాలీవుడ్ హీరోయిన్స్ ముఖ్యంగా కరీనాను అనుకరిస్తూ వీడియోలను పంచుకుంటుంది. ఆమె కరీనా కపూర్‌కి ప్రింట్ తీసినట్లు కనిపించడంతో బాగా ఫేమస్ అయింది.