హ్యాండిచ్చిన హీరోకే మ‌ళ్లీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కాజ‌ల్‌.. చుక్క‌ల్లో రెమ్యున‌రేష‌న్‌!?

గ‌త ఏడాది పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ రీఎంట్రీకి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కోలీవుడ్ లో శంక‌ర్‌, క‌మ‌ల్ హాజ‌న్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న `ఇండియ‌న్ 2` ప్రాజెక్ట్ లో భాగ‌మైంది. అలాగే నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న `ఎన్‌బీకే 108`లోనూ కాజ‌ల్ హీరోయిన్ గా ఎంపిక అయిందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ మ‌రో సీనియ‌ర్ స్టార్ సినిమాకు ఒకే చెప్పింద‌ట‌. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడను ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో నాగార్జుకు జోడీగా కాజ‌ల్ ను తీసుకున్నార‌ట‌.

 

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయ‌ని అంటున్నారు. పైగా ఈ మూవీకి కాజ‌ల్ ఏకంగా రూ. 3 కోట్లు అడిగింద‌ట‌. చుక్క‌ల్లో రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ప్ప‌టికీ.. సీనియ‌ర్ హీరోల‌కు ఉన్న హీరోయిన్ల కొర‌త కార‌ణంగా ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు నిర్మాత‌లు ఓకే చెప్పార‌ని టాక్‌. కాగా, నాగార్జున గ‌త చిత్రం `ది ఘోస్ట్‌`లో మొద‌ట కాజ‌ల్ అగ‌ర్వాల్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ, ష‌టింగ్ టైమ్‌కు కాజ‌ల్ గ‌ర్బం దాల్చ‌డంతో.. ఆమె `ది ఘోస్ట్‌` నుంచి త‌ప్పుకుని నాగార్జున‌కు హ్యాండిచ్చింది. ఇప్పుడు అదే హీరోకు మ‌ళ్లీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.