`అమిగోస్‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. క‌ళ్యాణ్ రామ్ దుమ్ము దులిపేశాడుగా!

`బింబిసార‌` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం `అమిగోస్`. నిన్న ఈ చిత్రం అట్ట‌హాసంగా విడుద‌లైంది. రాజేంద్రరెడ్డి ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు పరిచ‌యం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది.

జిబ్రాన్ సంగీతం అందించాడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేసి అద‌ర‌గొట్టాడు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం డిసెంట్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా నిరాశ పరిచాయి. మినిమమ్ బుకింగ్స్ కూడా సొంతం చేసుకోలేకపోవ‌డంతో.. తొలి రోజు క‌లెక్ష‌న్స్ పై తీవ్ర ప్ర‌భావం పడుతుంద‌ని భావించారు. కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద క‌ళ్యాణ్ రామ్ దుమ్ము దులిపేశాడు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.03 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 2.58 కోట్లు రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా అమిగోస్ ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 71 ల‌క్ష‌లు
సీడెడ్: 29 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 23 ల‌క్ష‌లు
తూర్పు: 18 ల‌క్ష‌లు
పశ్చిమ: 10 ల‌క్ష‌లు
గుంటూరు: 31 ల‌క్ష‌లు
కృష్ణ: 13 ల‌క్ష‌లు
నెల్లూరు: 8 ల‌క్ష‌లు
————————————-
ఏపీ+తెలంగాణ‌= 2.03 కోట్లు(3.50కోట్లు~ గ్రాస్‌)
————————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 20 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌ – 35 ల‌క్ష‌లు
————————————–
టోట‌ల్ క‌లెక్ష‌న్స్ = 2.58 కోట్లు(4.65 కోట్లు~ గ్రాస్)
————————————–

కాగా, రూ. 11.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. దీంతో ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే తొలి రోజు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 9.42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.