హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చందమామ సినిమా ద్వారా హీరోయిన్గా అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్.. ఇక తన స్నేహితుడు కీచ్లు గౌతమ్ ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది.. దీంతో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే కాజల్ అగర్వాల్ తల్లి అయినప్పటికీ కూడా వరుసగా పలు సినిమాలలో నటించే అవకాశాలు వెలుబడుతున్నాయి. ఇప్పటివరకు కమలహాసన్ కు జోడిగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తున్నది.

Kajal Aggarwal to quit acting? Singham actress spills beans
ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఒక చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే కాజల్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మరొక సీనియర్ హీరో నాగార్జునకు జోడిగా కాజల్ అగర్వాల్ ఒక చిత్రంలో నటించబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ మధ్య సీతారామన్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ను ఈ చిత్రంలో ఎంపిక చేశారని వార్తలు వినిపించాయి.. మరి ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో నటిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఈ చిత్రాలలో నటిస్తోందా లేకపోతే తల్లి పాత్రలో కూడా నటిస్తోందా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి కాజల్ కు వివాహమైన తర్వాత కూడా పలు చిత్రాలలో ఇన్ని అవకాశాలు వస్తున్నాయా లేదా అనే విషయంపై కాజల్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.