రూ.1000 కోట్ల ఆస్తి ఎలా పోయిందో చెప్పిన జగపతిబాబు..!!

ఒకప్పుడు లవర్ బాయ్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను అందుకున్నారు నటుడు జగపతిబాబు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు అలాంటి హీరో ఒకానొక సమయంలో చాలా దినస్థితిలోకి మారిపోయారు బ్యాంకు అకౌంట్ లో రూపాయి లేని రోజున కూడా చూశారట. ఇప్పుడు జగపతిబాబు నెగిటివ్ పాత్రలతో మంచి ఆదాయాన్ని పొందుతున్నట్లుగా తెలుస్తోంది. మొదటిసారి తన ఆస్తి లెక్కల విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Jagapathi Babu about his role in Syeraa

జగపతిబాబు తండ్రి కూడా సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు నిర్మాతగా పలు చిత్రాలకు వ్యవహరించారు. ఇక ఇదే బ్యానర్లో జగపతిబాబు హీరోగా కూడా పలు చిత్రాలలో నటించారు. అయితే ఒకానొక సమయంలో మాత్రం వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ కావడంతో తన హవా కోల్పోయారు జగపతిబాబు.. జగపతిబాబు మాట్లాడుతూ ఒకసారి ఒక హీరోతో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో సరిగ్గా భోజనం కూడా పెట్టలేదట సీట్లో గౌరవం కూడా ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయని ఒక లైట్ మ్యాన్ వచ్చి అయితే నా కాళ్లు దగ్గర కూర్చొని కూడా ఆ పరిస్థితిని చూసి ఏడ్చాడు అలా ఎన్నో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నానని తెలియజేశారు జగపతిబాబు.

డబ్బు విషయంలో ఇండస్ట్రీలో చాలామంది పెరిగిపోతూ ఉండడం వలన లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటారు. ఆ విషయంలో నాగార్జున ఒక్కడే కరెక్ట్ అని తెలియజేశారు. నాగార్జున ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అని కూడా తెలిపారు జగపతిబాబు.. ఇక తనకు ఉన్న డబ్బు విషయంలో అయితే జీరో నాలెడ్జ్ ఉందని ఒకప్పుడు తాను సంపాదించిన ఆస్తి లెక్క ప్రకారం ఇప్పుడైతే రూ.1000 కోట్ల రూపాయలు ఉండాలి అయితే ఆ డబ్బు ఇప్పుడు లేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టము.. కేవలం ఆ డబ్బు మొత్తం క్యాసినోలో నేను పోగొట్టుకున్నానని తెలిపారు.. అయితే క్యాసినో నేను కేవలం ఎంటర్టైన్మెంట్ కె ఆడతాను పేకాట వంటివి అసలు ఆడనని తెలిపారు.