అనన్య నాగళ్ల.. ఆకట్టుకునే అందం, అంతకుమించిన నటనా ప్రతిభ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ఆఫర్లు లేక ఈ బ్యూటీ ఎప్పటినుంచో తీవ్రంగా సతమతం అవుతోంది. తెలంగాణలో జన్మించిన ఈ తెలుగమ్మాయి.. `మల్లేశం` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది.
తొలి సినిమాతోనే నటిగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత అవకాశాల లేక సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోకు తెర లేపింది.
తరచూ ట్రెండీ దుస్తుల్లో క్లీవేజ్ షో చేస్తూ నెట్టింట దుమారం రేపుతుంటుంది. తాజాగా బ్లాక్ శారీలో ఈ భామ యమా హాట్ గా దర్శనమిచ్చింది. కసి చూపులతో కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది.
అనన్య నాగళ్ల అందాల జాతరకు కుర్రకారు ఫుల్ టెంప్ట్ అయిపోతున్నారు. అంత హాట్ అనన్య ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం అనన్య లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.