బాలీవుడ్లో మిస్టర్ ఫర్ఫెక్ట్ గా పేరు పొందిన అమీర్ ఖాన్ ఆరోగ్యం పైన అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు బాలీవుడ్లో చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల ఒక వివాహ వేడుకకు హాజరైన అమీర్ ఖాన్ చేతిలో స్టిక్ పట్టుకొని ఉంటూ మెల్లమెల్లగా అడుగులు వేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన కు ఫోటోలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి దీంతో అమీర్ ఖాన్ కు ఏమయింది అంటూ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.
మరి కొంతమంది అమీర్ ఖాన్ కాలికి ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై.. అటు అమీర్ ఖాన్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గత ఏడాది అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా విజయం అందుకోలేకపోయిందిఈ సినిమా విడుదల తర్వాత మీడియా ముందుకు రాలేదు అమీర్ ఖాన్. ఇక తన తదుపరి ప్రాజెక్టుల విషయంపై కూడా అప్డేట్ కూడా చెప్పలేదు అంతేకాకుండా కొన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
జైపూర్ లో జరిగిన పెళ్లి వేడుకలో అమీర్ ఖాన్ ఇలా చేతిలో స్టిక్ పట్టుకొని కనిపించడంతో అభిమానులు తెగ కంగారుపడుతున్నారు. ఇది వార్డ్ డిస్నీ కంపెనీ ఇండియా స్టార్ ఇండియా అధ్యక్షుడు మాధవన్ కుమారుడి పెళ్లి వేడుకలో ఇలా కనిపించడం జరిగింది. ఇక వీరితోపాటు అక్షయ్ కుమార్ మోహన్లాల్ కరణ్ జోహార్ కమలహాసన్ తదితరులు ఈ పెళ్లి వేడుకలు సందడి చేయడం జరిగింది.
View this post on Instagram