రామ్ చ‌ర‌ణ్ పై రివేంజ్ తీర్చుకున్న ఉపాస‌న‌.. వీడియో చూస్తే న‌వ్వాగ‌దు!

టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన జంట కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంప‌తులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. మరి కొద్ది నెలల్లో రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ కపుల్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ‌ వైరల్ అవుతోంది. ఓ నెటిజ‌న్ క్రియేట్ చేసిన వీడియో ఇది. రామ్ చరణ్ పై ఉపాసన సరదాగా రివేంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది ఓ వీడియో ద్వారా చూపించాడు. ఈ వీడియో చూస్తే న‌వ్వాగ‌దు. అస‌లింత‌కీ ఆ వీడియోలో ఏముందంటే.. అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన, సాయి ధరమ్ తేజ వీడియో ఒకటి అప్పట్లో తెగ వైరలైంది.

మొదట ముగ్గురు ఒకే సోఫాలో కూర్చోగా.. కాసేపటికి చ‌ర‌ణ్‌ ఉపాసనను వేరే సీటులోకి వెళ్ల‌మ‌ని సరదాగా చెప్పి ఆటపట్టించాడు. అయితే ఈ వీడియోను తీసుకుని గతంలో కరోనా వచ్చినప్పుడు రామ్ చరణ్ ఇంట్లో అన్ని ప‌నులు చేసిన వీడియోను జ‌త చేశాడో నెటిజ‌న్‌. త‌న‌ను ఆట‌ప‌ట్టించినందుకు రామ్ చ‌ర‌ణ్ పై ఇలా ఉపాస‌న రివేంజ్ తీర్చుకుంది అంటూ స‌ర‌దు నెటిజ‌న్ వీడియోను సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఉపాసన కూడా ఈ వీడియోను లైక్ చేయడంతో.. మ‌రింత వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/reel/CoRXdKhJo9j/?utm_source=ig_web_copy_link