వ్యభిచార సంఘటనపై ఫస్ట్ టైం ఓపెన్ అయిన నటి యమున..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలలో ఎంతోమంది ఉన్నప్పటికీ నటి యమునా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక దశలో ఎంతోమంది హీరోల సరసన నటించిన యమున అనుకోని విధంగా తనపైన వ్యభిచారం పుకార్లు వైరల్ గా మారాయి. దీంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. దీంతో కొంతమంది జనాలు సైతం ఈమెను సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టారని దీంతో కొంతకాలం మీడియాకు దూరంగా ఉంటున్నానని తెలియజేస్తోంది.

Yamuna Wiki Bio Age Husband Salary Photos Videos News Ig Fb Tw - Celeb Wiki
అయితే ఇన్ని రోజులకు తన మౌనాన్ని బ్రేకు ఇస్తూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఈ విషయం గురించి షేర్ చేసింది. నిజంగా తాను ఏ తప్పు చేయలేదని కావాలని కొంతమంది తనను ఇరికించారని.. నేను ఆరోజు ఆ హోటల్ కి అసలు వెళ్లలేదు.. వ్యభిచారి అని నిందపడ్డాక బతకాలనిపించలేదు కేవలం పిల్లలకు చెడ్డ పేరు రాకుండా ఆస్తులు వీలునామ రాసి జీవితం చాలించాలనుకున్నానని తెలిపింది..కానీ ఒక స్నేహితురాలు బ్రెయిన్ వాష్ చేయడంతో పిల్లల కోసం మనోధైర్యాన్ని నింపుకొని మరి కొత్త జీవితాన్ని ప్రారంభించారని తెలియజేసింది యమునా.

ఇక అలా కాలక్రమంలో ఎదుటివారి మాటలు అసలు పట్టించుకోకూడదనుకున్నాను ..మనం ఏంటో మనకు తెలుసు అని నిజాన్ని పుస్తకాలు చదివి నేర్చుకున్న నా అనుమతి లేకుండా ఎవరు తన ఎమోషన్స్ని టచ్ చేయలేరు అనేది కేవలం మైండ్లో పెట్టుకున్నాను.. క్షణికావేశాలను దాటితే పెద్ద సమస్య కూడా చిన్నదిగా అవుతుంది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ ఉంటుందని తెలిపింది యమునా ప్రస్తుతం తమ జీవితం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.