ఐశ్వర్య రాయ్-సల్మాన్ ఖాన్.. ఎఫైర్ నిజమేనా..?

బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరో అయిన సల్మాన్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి పలు బ్లాక్ బాస్టర్ విజయాలలో నటించారు. ఇక అలాగే తెలుగు, బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న హీరోయిన్లలో ఐశ్వర్యరాయ్ కూడా ఒకరు. ప్రపంచ సుందరిగా పేరు పొందిన ఈమె సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడి చివరికి బ్రేకప్ అయ్యిందని వార్తలు ఇప్పటికీ బాలీవుడ్లో వినిపిస్తూ ఉంటాయి. అయితే వీరిద్దరు మంది ఉన్న ఎఫైర్ నిజమో కాదో తెలుసుకుందాం.

Aishwarya Rai and Salman Khan's rare images | Bollywood News – India TV
ఇక ఐశ్వర్యరాయ్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సమయంలో మరొక హీరోయిన్ తో సల్మాన్ ఖాన్ ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రీతి జింతానే.. ఈ విషయం తెలిసి ఆఖరిలో ఐశ్వర్యరాయ్ వివాహానికి నిరాకరించిందని వార్తలు అప్పట్లో వినిపించాయి. ఐశ్వర్యారాయ్ ,సల్మాన్ ఖాన్ పీకల్లోతు ప్రేమలో మునిగితేరిన వీరు ఆ రోజుల్లో చెట్టపటలేసుకొని తిరిగినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని వీడియోస్ కూడా అప్పట్లో లీక్ కావడం తో బాలీవుడ్ మీడియాలో పలు కథలు వినిపించాయట.

Did Aishwarya Rai want Salman Khan to separate from his family, stop  supporting them?ఈ విషయంపై ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ తో గొడవ పడడం కూడా జరిగిందట. ఇలా జరగడం వల్ల వీరిద్దరి పెళ్లికి ఎండ్ కార్డ్ పడిందని సమాచారం.. అప్పటినుంచి ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్యరాయ్ మాట్లాడుకోలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రీతి జింతా కూడా 2016 ఒక బిజినెస్ మ్యాన్ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కత్రినా కైఫ్ తో కొద్దిరోజులు డేటింగ్ చేసిన సల్మాన్ ఖాన్ మళ్లీ విడిపోయారు. ఆ తర్వాత జాక్వెలిన్ తో డేటింగ్ చేసినట్లుగా సమాచారం.