సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్.. ప్రముఖ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఏడడుగులు వేసింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ ను చూసిన నెటిజన్లు రాహుల్ సిప్లిగంజ్ శివాత్మిక పెళ్లి చేసుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
కానీ నిజానికి వీరిది రియల్ పెళ్లి కాదు.. రీల్ పెళ్లి. అవును, టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం `రంగమార్తాండ`. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
చాలా కాలంగా సెట్స్ పై ఉన్న ఈ చిత్రం.. 2023లో థియేటర్స్ లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా నుంచి ఓ పిక్ బయటకు వచ్చింది. ఇందులో పెళ్లి కూతురుగా శివాత్మిక కనిపించగా.. పక్కనే పెళ్లి కొడుకుగా రాహుల్ సిప్లిగంజ్ ఉన్నాడు. అలాగే ఈ పిక్ లో శివాత్మిక తల్లి దండ్రులుగా ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ కనిపిస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ సహా మరికొందరు కూడా ఈ పిక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు రాహుల్, శివాత్మికలను మీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా, చేసుకోండి మీ జంట బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.