రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ మీరాజాస్మిన్..!!

ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీరాజాస్మిన్ కూడా ఒకరు. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఎంతోమంది కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.. అయితే ఫెడట్ అవ్వడం వల్ల వివాహం చేసుకొని పలు రకాల కారణాల చేత కనుమరుగైన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అలా ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మంచి విజయాలు అందుకున్న వారిలో నదియా, మీన, సిమ్రాన్ ,కుష్బూ భూమిక, స్నేహ ,మమతా మోహన్ దాస్ ఇలా చాలా మందే ఉన్నారని చెప్పవచ్చు.

Meera Jasmine: Meera Jasmine's Tollywood Re-Entry Fix.. Not Cute This  Time.. Bit Spicy.. | Meera Jasmine's Grand Re Entry In Tollywood Confirmed  Here is detail Telugu News IG News | IG News
అయితే ఇప్పుడు తాజాగా హీరోయిన్ మీరాజాస్మిన్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి తన అభిమానుల మైమరిపించడానికి సిద్ధమయ్యింది. గడిచిన కొద్ది రోజుల క్రితం తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో తన వయ్యారాలు వలకబోస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ మలయాళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్. కొంతకాలంగా గ్లామర్ లుక్ పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా తన పేరును మారేలా చేసుకుంది ఒకప్పుడు హోమ్లీ లుక్స్ తో వెండితెరపై అలరించిన మీరాజాస్మిన్ ఇలా ఒక్కసారి గ్లామర్ గేట్లు తీసివేయడంతో అవకాశాలను సంపాదించుకుంది.

Meera Jasmin: హమ్మయ్య.. టాలీవుడ్ రీ ఎంట్రీ సెట్ అయ్యిందంట

ఈమె తెలుగులో చివరిసారిగా 2013లో మోక్ష అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత తమిళ్ ,మలయాళం చిత్రాలలో కనిపించింది.ఈ క్రమంలోని 2018 నుంచి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఈమె కెరియర్లో భద్ర, గుడుంబా శంకర్, మహారధి, గోరింటాకు వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కన్నడ తో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈమె చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ ప్రేక్షకుల మనసులు నిలిచిపోయే పాత్రలలో నటించింది.ఆ తర్వాత వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరమైంది కొన్ని కారణాలు చేత తన భర్తతో దూరంగా ఉన్నట్లు సమాచారం.