బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ మరో మూడు రోజుల్లో ఓ ఇంటిది కాబోతోంది. బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు నడవబోతోందని బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు వీరి పెళ్లి పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇన్ డైరెక్టర్ గా సిద్ధార్థ్ కీయారా మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని పేర్కొన్నారు.
అయితే ఫిబ్రవరి 6న కియారా, సిద్ధార్థ్ మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్ ప్యాలేస్ వివాహ వేదిక కానుందనీ, పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహంలో సందడి చేయబోతున్నారు.
అలాగే మెహందీ, సంగీత్, పెళ్లి.. ఈ మూడు వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయట. మెహందీ, సంగీత్ ఒకే రోజున, ఆ మర్నాడు వివాహ వేడుకను కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారని.. ప్రస్తుతం జైసల్మేర్ ప్యాలేస్ లో పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అలాగే కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని అంటున్నారు.