నా భర్త విడాకులకు నేనే కారణం.. షాకింగ్ విష‌యాలు బ‌య‌టపెట్టిన హ‌న్సిక‌!

యాపిల్ బ్యూటీ హ‌న్సిక ఇటీవ‌లె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాతో వివాహం చేసుకుందీ బ్యూటీ. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో జైపూర్‌లోని ముండోతా కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్ప‌ట్లో నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. ఇక‌పోతే సోహైల్‌ కతూరియాకు ఇది రెండో వివాహం. అత‌డికి గ‌తంలో రింకీ బ‌జాజ్ అనే అమ్మాయితో వివాహం జ‌రిగింది.

రింకీ బ‌జాజ్ హ‌న్సిక‌కు బెస్ట్ ఫ్రెండ్‌. వీరి వివాహానికి సైతం హ‌న్సిక హాజ‌రు అయింది. ఆ త‌ర్వాత రింకీ బ‌జాజ్ తో సోహైల్ విడిపోవ‌డం.. హ‌న్సిక‌తో ప‌రిచ‌యం, ఆపై ప్రేమ‌, పెళ్లి వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్లింది. హన్సిక వివాహా వేడుకను డిస్నీ+ హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ చేశారు. `లవ్‌ షాదీ డ్రామా` పేరుతో వివాహ వేడుకను ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 10న స్ట్రీమింగ్ చేశారు. అసలు సోహెల్ తన జీవితంలోకి ఎలా వచ్చాడు..? వారి పరిచయం ఎలా జరిగింది..? పెళ్ళిదాకా వారి ప్రయాణం గురించి లవ్ షాదీ డ్రామా లో హన్సిక వివరించింది.

సోహెల్ తన జీవితంలోకి వచ్చిన క్షణాలు మాత్రం తనకు చాలా ప్రత్యేకం అని ఆమె తెలిపింది. ఇక‌ `పెళ్లి గురించి సీక్రెట్ గా ఉంచాల‌నుకున్నా.. కానీ, అంద‌రికీ చెప్ప‌క త‌ప్ప‌లేదు. అయితే సోహైల్ ను అంద‌రికీ ప‌రిచయం చేయ‌గానే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. సోహెల్ గతంలో జ‌రిగిన‌ పెళ్ళి గురించి డిస్కర్షన్ స్టార్ట్ అయ్యాయి. సోహెల్ విడాకుల‌కు నేనే కార‌ణమంటూ కొంత మంది న‌న్ను విమ‌ర్శించారు. అది న‌న్ను ఎంతో బాధించింది. వారు విడిపోవడానికి నేను కారణం కాదు. సోహెల్ గతం గురించి నాకు ముందే తెలుసు` అని హ‌న్సిక చెప్పుకొచ్చింది. దీంతో హ‌న్సిక కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.