జూనియ‌ర్ ఎన్టీఆర్ సీత ఇప్పుడు ఏం చేస్తుందో ? ఎక్క‌డ ఉందో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవకముందే బాల నటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. అలా తన తాత నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాల నటుడిగా కనిపించినన ఎన్టీఆర్.. ఆ తర్వాత 1996లో బాలరామాయణం సినిమాలో కూడా రాముడిగా నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో పిల్లలతో కలిసి నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా కూడా ఇదే. ఈ సినిమాను మల్లెమాల బ్యానర్ పై ఎమ్మెస్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఆరోజుల్లోనే వంద రోజులకు పైగా ఆడి ఎన్నో అరుదైన రికార్డులను క్రియేట్ చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాముడు గా నటించిన ఈ సినిమాకు జాతీయస్థాయి ఉత్తమ బాలల చలనచిత్రంగా ఎన్నో అవార్డులను అందుకుంది. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన ఆ చిన్నారి నటనకు అప్పట్లో ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. మరీ ముఖ్యంగా ఆమె క్యూట్ లుక్స్ తో పాటు ఎన్టీఆర్ పక్కన సీతగా తన అభినయంతో అందర్నీ కట్టిపడేసింది. ఇక ఆ చిన్నారి పేరు స్మిత మాధవ్.

ఇప్పుడు ఆ చిన్నారి సీత ఎలా ఉందో చూస్తే అందరూ ఆశ్చర్యపోక మానరు. స్మిత మాధవ్ కర్ణాటక క్లాసికల్ సింగర్. అలాగే ఆమె భరతనాట్యం డాన్సర్ కూడా..! ఆమె శృతిలయ కేంద్ర నటరాజాలయ‌ డైరెక్టర్. గురు నృత్య చూడామణి శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ ద్వారా భరతనాట్యంలో శిక్షణ పొందింది. అలాగే స్మిత హైదరాబాద్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ దగ్గర కూడా కర్ణాటక శాస్త్రియ‌ సంగీతంలో శిక్షణ పొందింది.

ఇక ఆమె తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సంగీతం నృత్యాలంలో డిప్లొమా ప్రోగ్రాం కూడా పూర్తి చేసుకుంది.ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా బాల రామాయణంలో నటించిన స్మిత పలు సినిమాలలో నటిస్తూ బుల్లితెరపై ఆమె అనేక షోలకు యాంకర్ గా చేస్తుంది. ఇప్పుడు ఈ సీత వెండి తెరపై హీరోయిన్‌గా రియంట్రీ ఇస్తే చూడాలని చాలామంది ఆశపడుతున్నారు.