బాక్సాఫీస్ వ‌ద్ద `వాల్తేరు వీర‌య్య‌` వీరాంగం.. 3 రోజుల్లో ఎంత రాబ‌ట్టింది?

ఆచార్య, గార్డ్‌ ఫాదర్ వంటి అప‌జ‌యాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా `వాల్తేరు వీర‌య్య‌` అనే మాస యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌వితేజ ఒక కీల‌క పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న అట్టహాసంగా విడుదలైంది.

ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో.. బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా వీర‌య్య వీరాంగం ఆడుతున్నాడు. తొలి రోజే ఏకంగా రూ. 29.30 కోట్ల రేంజ్ లో షేర్ ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 14.60 కోట్ల‌ను రాబ‌ట్టింది. ఇక మూడో రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.61 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకున్న వాల్తేరు వీర‌య్య.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 15.01 కోట్లు అందుకుంది.

ఈ సినిమా రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అంటే ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే.. మొద‌టి మూడు రోజులు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 30.09 కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఏరియాల వారీగా వాల్తేరు వీర‌య్య 3 రోజులు టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 16.16 కోట్లు
సీడెడ్: 9.16 కోట్లు
ఉత్త‌రాంధ్ర: 5.55 కోట్లు
తూర్పు: 4.54 కోట్లు
పశ్చిమ: 2.88 కోట్లు
గుంటూరు: 4.11 కోట్లు
కృష్ణ: 3.19 కోట్లు
నెల్లూరు: 1.87 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌=47.46 కోట్లు(76.80 కోట్లు~ గ్రాస్‌)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 3.90 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 7.55 కోట్లు
—————————————-
వ‌ర‌ల్డ్ వైడ్‌= 58.91 కోట్లు(101.95 కోట్లు~ గ్రాస్‌)
—————————————-