రాజకీయాల్లో పవన్ కళ్యాజ్ సంపాదనపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్!!

 

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం పై నాగబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఈ మధ్య పవన్ కళ్యాణ్ కు సెక్యూరిటీ ఉపసంహరించటంపై నాగబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామిక హక్కులను హరించటం మంచి పద్ధతి కాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే వైసీపీకే తీవ్ర నష్టం చేకూరుతుందని నాగబాబు తెలిపారు.

ఇక తాను 2024వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నాగబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏమీ సంపాదించడం లేదని కేవలం సినిమాల ద్వారా మాత్రమే డబ్బులు వస్తున్నాయని నాగబాబు ఇంటర్వ్యూలో చెప్పారు. తాను సంపాదించిన డబ్బులు మొత్తం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నారని నాగబాబు పేర్కొన్నారు. పవన్ కు పెద్దగా ఆస్తులు ఏమీ లేవని నాగబాబు చెప్పారు. శంకర్పల్లిలో ల్యాండ్ ఉందని అది కూడా చాలా తక్కువ వాల్యూ చేస్తుందని నాగబాబు చెప్పారు. తనకు కూడా ఏమి వ్యాపారాలు లేవని నాగబాబు చెప్పారు.

ఇక అలాగే పవన్ కళ్యాణ్ తాను సంపాదించిన డబ్బులు మొత్తం కూడా ప్రజల అభివృద్ధి కోసమే కాకుండా పార్టీ అభివృద్ధి కోసం కూడా ఖర్చు చేశారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఏపీలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం టీడీపీ, జనసేన కలిసి వైసీపీని ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి ఉండాల్సిందే.