వీర సింహారెడ్డి: ఆ విషయంలోనూ బాల‌య్య‌ అన్ స్టాపబుల్‌..!

సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నా సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు ఎంతో పిక్ స్టేజిలో జరుగుతున్నాయి. ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోలైనా చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ భారీ లో నిలిచారు. ఇక ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్- అజిత్ సినిమాలు కూడా ఈ సంక్రాంతికి రాబోతున్నాయి.

Veera Simha Reddy : రిలీజ్ సెంటర్లలోనూ అన్ స్టాపబుల్ అనిపిస్తున్న బాలయ్య. సంక్రాంతికి ఎక్కువ థియేటర్లతో వీరసింహారెడ్డిదే హవా

ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నాయి. టాలీవుడ్ మొత్తం చిరంజీవి- బాలకృష్ణ సినిమాలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక బాలకృష్ణ ముందుగా జనవరి 12న వీర సింహారెడ్డి సినిమాతో థియేటర్లో దిగబోతున్నాడు. ఆ తర్వాత రోజు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వస్తున్నాడు.

ఇక ఈరోజు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఒంగోల్‌లో ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో మారింది. ఇక ఈ రెండు సినిమాలలో ముందు నుంచి బాలకృష్ణ- చిరంజీవిని తొక్కేస్తూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాల ఓవర్సీస్ ఫ్రీ సేల్స్ లో కూడా బాలకృష్ణ సూపర్ క్రేజ్ లో దూసుకుపోతున్నాడు.

ఇప్పుడు తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించినన థియేటర్ల లిస్ట్ కూడా బయటకు వచ్చింది. ఇక వాటిలో కూడా బాలకృష్ణ సూపర్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. అయితే అన్ని సినిమాల్లోకి బాలయ్య సినిమా వీర సింహారెడ్డి కే ఎక్కువ థియేటర్లు దక్కాయి. మొత్తంగా నైజాంలో వీర సింహారెడ్డి 210 థియేటర్లు, వారసుడు 200 థియేటర్లు, వాల్తేరు వీరయ్య 180 థియేటర్లు, అజిత్ హీరోగా వస్తున్న తెగింపు 40 థియేటర్లలో విడుదల కానుంది.

దీంతో పండగ సందడి మరింత రెటింపు అయింది నైజాం నందమూరి అభిమానులకి. ఇప్పటికే రెండు డిఫరెంట్ రోల్స్ తో బాలయ్య లుక్, థమన్ సాంగ్స్.. ఇలా ప్రతీ విష‌యంలోను ఫ్యాన్సుకి అంచనాలాను అమాంతం పెంచేస్తున్నాయి. ఇక పండగ టైమ్ లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కానుండడంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తాయంటూ లెక్కలేసుకుంటున్నారు.