కేజీఎఫ్ పరమ చెత్త మూవీ.. కాంతారా యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!

కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 భారతదేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఏ మూవీతో కన్నడ ఇండస్ట్రీ తన సత్తా ఏంటో చాటుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1,250 కోట్లు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ మూవీని హోంబాలే ఫిలింస్‌ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇదే బ్యానర్‌లో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా కాంతార. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 400 కోట్లు సాధించింది. అలా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమాలు భారత చలనచిత్ర పరిశ్రమను ఒక ఊపు ఉపేసాయి. అయితే కేజీఎఫ్ సినిమాని అందరూ మెచ్చుకుంటుంటే ఆ ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడే ఇప్పుడు దానిని పరమ చెత్త అని పిలిచి పెద్ద చర్చకు దారి తీసాడు.

కాంతారా సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్ చేసిన కిశోర్‌ కుమార్‌ కేజీఎఫ్ ఓ చెత్త సినిమా అని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్య్వూలో అతడు ఈ షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంతారతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన కిశోర్‌ ఇంటర్వ్యూలో పాటిస్పేట్ చేసి కేజీఎఫ్ మూవీపై కామెంట్స్ చేశాడు.

‘కేజీఎఫ్ మూవీ నేను ఇప్పటిదాకా చూసింది లేదు. నిజానికి ఇలాంటి సినిమాలు నాకు నచ్చవు. అది నా పర్సనల్ ఛాయిస్. ఈ తరహా చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కాని మంచి కథతో వచ్చిన ఓ చిన్న సినిమా చూసేందుకు ఇష్టపడతాను.’ అంటూ కిషోర్ పేర్కొన్నాడు. ఇకపోతే బన్నీ హీరోగా నటించిన ‘హ్యాపీ’, నాని నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాల్లో మంచి ఇంపార్టెంట్ రోల్స్ పోషించి ఈ నటుడు తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో కనిపించి మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నాడు.