కే.జి.ఎఫ్ ఒక చెత్త సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు ..!!

కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన చిత్రాలలో కేజిఎఫ్ కాంతారావు సినిమా కూడా ఒకటి. ఇక సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఈ సినిమాల పైన చర్చ జరుగుతూ వస్తోంది. అందుకు ముఖ్య కారణం ప్రముఖ నటులలో ఒకరైన నటుడు కిషోర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నటుడు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. వాస్తవానికి కేజీఎఫ్ కాంతారా సినిమాలను నిర్మించింది హోం భలే ఫిలిం బ్యానర్ అని అందరికీ తెలిసిందే.. ఈ రెండు చిత్రాలకు కథపరంగా బడ్జెట్ పరంగా ఎలాంటి పోలికలు లేవు ఎక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందించిన కేజిఎఫ్ సినిమా రెండు భాగాలుగా విడుదలై మంచి కలెక్షన్లను అందుకుంది.

Twitter suspends 'Kantara' actor Kishore Kumar G's account for violating  rules | Bengaluru - Hindustan Times

ఇక ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతారా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల కథ విషయానికి వస్తే కేజిఎఫ్ సినిమాలో గోల్డ్ మాఫియా బ్యాక్ గ్రౌండ్లో తెరకెక్కించారు. స్టోరీ కొత్తది కాకపోయినా డైరెక్టర్ ప్రశాంతి నీల్ ఈ సినిమాని అద్భుతంగా టేకింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా చూపించారు. బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 90 లో అప్పట్లో అరాచకాలు ముఖ్యంగా పురాతన కోలం నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి మరొకసారి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ నటుడు రిషబ్ శెట్టి.

ఇప్పటికే మీడియా సమావేశంలో కాంతార సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్గా నటించిన కిషోర్ సినిమా ఒక చెత్త సినిమా అంటూ కామెంట్లు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారుతోంది. ఈ విషయంపై కిషోర్ మాట్లాడుతూ ఇది సరైన విషయం కాదో తెలియదు కానీ కేజీఎఫ్ సినిమాని నేను చూడలేదు నా టైపు సినిమా అది కాదు అంటూ తన వ్యక్తిగత విషయంలో ఇది ఒక చెత్త సినిమా అని తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.