అల్లుడు డైలాగ్ ని కాపీ కొట్టిన వాల్తేరు వీరయ్య.. అంతా సేమ్ టు సేమ్ దింపేసాడు గా…!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిన్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎంతో గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదల చేయగా దానికి కూడా సెన్సేషనల్ వ్యూస్ ను రాబట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

ఇక ఈ సినిమాను దర్శకుడు బాబి చిరంజీవి రేంజ్‌కు తగ్గట్టు భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటించింది. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే చిరంజీవితోపాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో ఓప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వార్త ఏమిటంటే ఈ సినిమాల‌లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ఆల్రెడీ మరో సినిమాలో ఉన్నది కావటం విశేషం.ఇక ఆ సినిమా మరి ఏమిటంటే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిరు అల్లుడు సాయి ధరమ్‌తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ లో నటించిన కమెడియన్ పృథ్వి, ఆ సినిమాలో సింగం సుజాత అనే కామెడీ క్యారెక్టర్ లో నటించాడు.

 Trolling On Chiranjeevi Records Dialogue In Waltair Veerayya Details, Chiranjeev-TeluguStop.com

అయితే ఆ సినిమాలో ఒక సన్నివేశంలో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు.. సింగం సుజాత ఒక డైలాగ్ చెబుతాడు. రికార్డ్స్ లో నా పేరు ఉండడమేంట్రా…నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి సుజాత సింగం సుజాత అంటూ.. ఈ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు పృథ్వి. ఇప్పుడు ఇదే డైలాగ్ ను వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో చిరు చెప్పడంతో మెగా అభిమానులు కూడా కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. విన్నర్ సినిమా డైలాగ్ ను వాల్తేరు వీరయ్య డైలాగ్‌ను జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకుడు బాబీని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వాల్తేరు వీరయ్య డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.