రాజమౌళి- అల్లు అరవింద్ మధ్య విభేదాలు రావడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు రాజమౌళి. రాజమౌళి డైరెక్టర్ గా గుర్తింపు పొంది ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. ఇప్పటివరకు తన కెరియర్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక డైరెక్టర్ గా పేరు పొందారు రాజమౌళి. తెలుగు ప్రఖ్యాతని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్న డైరెక్టర్గా పేరుపొందారు. బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్లొ తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించారు.

Rajamouli Angry On Allu Aravind

RRR చిత్రం ఇటీవలే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలయ్యింది. తాజాగా ఈ చిత్రంలోని పాటకు గోల్డెన్ అవార్డు కూడా దక్కింది. ఆస్కార్ బరిలో కూడా నిలబడింది. ఇంతటి గొప్ప దర్శకుడుతో సినిమా చేయాలని ప్రతి హీరో కూడా అనుకుంటూ ఉంటారు. బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళి తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం కేవలం తెలుగు హీరోలతో మాత్రమే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రాజమౌళి, అల్లు అర్జున్ తో సినిమా చేయటానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్నారు. అయితే ఆ సమయంలో సినిమాల లెక్కల గురించి బయటికి చెప్పకూడదని అలాగే మగధీర సినిమాని తెలుగుతోపాటు ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని అల్లు అరవింద్ కి కండిషన్ పెట్టారట. కానీ అల్లు అరవింద్ మాత్రం రాజమౌళి మాటను వినకుండా పక్కన పెట్టేసారట. ఉండడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య కోల్డ్ వారు నడుస్తోందని సమాచారం అందువల్లే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా తీయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది