మెగా హీరోల‌తో శ‌ర్వా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ పిక్‌!

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన హీరోల్లో శ‌ర్వానంద్ ఒకడు. 2022 ఆరంభంలో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమాతో నిరాశ ప‌రిచినా.. `ఒకే ఒక జీవితం` మూవీతో హిట్ అందుకుని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈ యంగ్ హీరో కొత్త ఏడాదిని ఎంతో ఘ‌నంగా ప్రారంభించారు.

అయితే శర్వానంద్ ఇద్దరూ స్పెషల్ పర్సన్స్ తో 2023కి స్వాగతం పలికాడు. ఇంత‌కీ ఈ ఇద్ద‌రు మ‌రెవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి, మ‌రియు ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. అవును, మెగా హీరోల‌తో శ‌ర్వా న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్ ను శ‌ర్వా ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంటూ `హ్యాపీయెస్ట్ డే.. హ్యాపీ న్యూ ఇయర్ గయ్స్` అని కామెంట్స్ చేశాడు.

ఈ పిక్ లో చిరు, శ‌ర్వా, చ‌ర‌ణ్ లు చిరు న‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. క్రేజీగా ఉన్న ఈ పిక్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను వేరె లెవ‌ల్ లో షేక్ చేస్తోంది. కాగా, మెగా ఫ్యామిలీతో శర్వానంద్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరూ స్కూల్ మేట్స్. మంచి ఫ్రెండ్స్ కూడా.

https://twitter.com/ImSharwanand/status/1609291757547827202?s=20&t=c2kfqarprfUVDIvWDWJLSg