ఆయ‌న స‌ల‌హాతో రెండో పెళ్లికి సిద్ధ‌మైన స‌మంత‌.. ఇంత‌కీ అబ్బాయి ఎవ‌రో తెలుసా?

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయినా రియల్ లైఫ్ లో మాత్రం కాలేకపోయింది. గ‌త కొద్ది నెలల క్రితం భర్త, ప్రముఖ హీరో నాగచైతన్య నుంచి సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు తిరక్క ముందే విడాకుల బాటపడ్డారు. అయితే నాగచైతన్య తో విడిపోయిన తర్వాత కెరీర్ పరంగా సమంత మరింత జోరు చూపించింది.

మయూసైటిస్ వ్యాధి క‌బ‌ళించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. దానితో పోరాడుతూ కెరియర్ పరంగా ముందుకు సాగుతోంది. అయితే భర్తతో విడిపోయిన తర్వాత సమంత ఎక్కువగా ఆధ్యాత్మికతవైపు మల్లుతోంది. అలాగే సద్గురు స్వామీజీకు తన వ్యక్తిగత విషయాల‌ను చెప్పుకుంటూ సలహాలు సూచనలు తీసుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే సద్గురు కాస్త చొరవ తీసుకుని సమంతకు ఇటీవ‌ల ఓ సలహా ఇచ్చారని ఇన్‌సైడ్ ఓ టాక్‌ నడుస్తోంది. గతాన్ని తలుచుకుంటూ ఆగిపోవద్దని.. రెండో వివాహం చేసుకోమని సద్గురు సమంతకు సూచించారట. ఆయన స‌ల‌హాను సమ్మతించిన సమంత తన క్లోజ్ ఫ్రెండ్ ను రెండో వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యిందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మ‌రి ఈ ప్రచారం నిజ‌మా..? లేదా పుకారేనా..? అన్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

Share post:

Latest