ప్రభాస్ ను వదలని లీకులు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సలార్ ఫొటోస్..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఈ పాన్ ఇండియా హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమాల్లో సలార్ మూవీ కూడా ఒకటి.. కే జి ఎఫ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఎన్నో సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌.. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి స‌లార్‌ సినిమా చేస్తున్నాడు.

Prashanth Neel's Female Centric Film On Cards?

ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సలార్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కే జి ఎఫ్ సినిమాలో యాష్ ను ఓ రేంజ్ లో హైలెట్ చేసిన ప్రశాంత్.. ఇప్పుడు సలార్‌ సినిమాలో ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడు అంటూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Salaar: Prabhas Makes Yet Another Announcement, Teams Up with KGF Director  Prashanth Neel for an Actioner | 🎥 LatestLY

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అవ్వగా.. ఈ సినిమాని కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఇది ఇలా ఉంటే ఈ సినిమా యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న లీకులు బెడద మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే ఈ సినిమాషూటింగ్ లొకేషన్ లో ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఇప్పుడు మరి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా నెటింట‌ వైరల్ అవుతున్న ఫొటోస్ లో ప్రభాస్ సూపర్ గా కనిపిస్తున్నాడు.

Salaar

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిత్ర యూనిట్ అప్రమత్తం అయిందని తెలుస్తుంది. ఇప్పటినుంచి అయినా షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఫోటోలు లీక్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ప్రభాస్- ప్రశాంత్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.