కేఎల్ రాహుల్ దంప‌తుల‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

టీమిండియా స్టార్‌ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టితో గ‌త కొన్నేళ్ల నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న రాహుల్‌.. ఎట్ట‌కేల‌కు పెద్ద‌ల అంగీక‌రంతో ఆమెను జ‌న‌వ‌రి 23న వివాహం చేసుకున్నాడు.

ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో రాహుల్‌, అతియా శెట్టి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరి పెళ్లి ఫోటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. అలాగే ఈ నూతన వధూవరులకు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ తో టీమిండియా ప్లేయర్స్ బిజీగా ఉండ‌టం వ‌ల్ల‌.. వారు రాహుల్ పెళ్లికి హాజ‌రు కాలేక‌పోయారు.

కానీ ఖరీదైన బహుమతుల రూపంలో వాళ్లు తమ విషెస్ పంపినట్లు సమాచారం. కేఎల్ రాహుల్ దంప‌తుల‌కు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి బీఎండబ్ల్యూ కారును కానుకగా ఇచ్చాడట. దీని ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే, ఈ కారు విలువ ఏకంగా రూ.2.17 కోట్లు ఉంటుందట‌. మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ రూ.80 లక్షల విలువైన కవాసకీ నింజా బైక్ ను రాహుల్ కు కానుక‌గా పంపించాడ‌ట‌. ఇక సునీల్ శెట్టి త‌న అల్లుడు రాహుల్ కు ముంబైలో రూ. 50 కోట్లు విలువ చేసే అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను గిఫ్ట్ గా ఇచ్చిన‌ట్లు స‌మాచారం.