`అక్కినేని తొక్కినేని` వ్యాఖ్య‌ల‌పై బాల‌య్య క్లారిటీ.. ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై!

ఇటీవల `వీర సింహారెడ్డి` సక్సెస్ మీట్ లో బాల‌య్య అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్పదమైన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈ విషయంపైనే నానా రచ్చ జరుగుతుంది. అక్కినేని అభిమానులు బాల‌య్య‌ పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం బాలయ్యకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

అయితే తాజాగా `అక్కినేని తొక్కినేని` వ్యాఖ్య‌ల‌పై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. హిందూపురంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. మొన్న జ‌రిగిన వీర సింహారెడ్డి స‌క్సెస్ మీట్ లో యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప నాగేశ్వరరావు గారిని కించపరిచే విధంగా తానేం మాట్లాడలేదని బాల‌య్య తెలిపారు. ఏఎన్నార్ గారిని బాబాయ్ అని పిలుస్తానని, ఆయ‌న తన పిల్లల కంటే తననే ఎక్కువగా ప్రేమించేవారు బాలయ్య చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీకి నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు కల్లలాంటివారని బాలయ్య అన్నారు. కొన్ని ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేద‌ని.. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య హోందాగా రిప్లై ఇచ్చారు.